దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.44 పెరిగి రూ.39,731గా ఉంది. కిలో వెండి ధర రూ.460 తగ్గి రూ.47,744గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర పెరగడానికి... నిన్నటి లాభాల కొనసాగింపు, రూపాయి అస్థిరతే కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమొడిటీస్) తపన్ పటేల్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,509 డాలర్లుగా, ఔన్స్ వెండి ధర 17.81 డాలర్లుగా ఉంది.
అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై సందేహాలు, అంతర్జాతీయంగా రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని తపన్ అభిప్రాయపడ్డారు. దేశీయ, ప్రపంచ మార్కెట్లకు సంవత్సరాంత సెలవులూ మరో కారణమని ఆయన వెల్లడించారు.
ఇదీ చూడండి:కొనుగోళ్ల మద్దతుతో... భారీ లాభాలు