నిన్నటి ట్రేడింగ్‌లో జీవిత కాల గరిష్ఠానికి చేరిన పసిడి ధరలు ఇవాళ దిగొచ్చాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడటం సహా అంతర్జాతీయ విపణిలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వంటి అంశాలు దేశీయ బులియన్ మార్కెట్లపై ప్రభావం చూపించాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.420 తగ్గి రూ.41,210కి చేరింది.
వెండి ధరలోనూ తగ్గుదల నమోదైంది. దిల్లీలో కిలో వెండి రూ.830 క్షీణించి రూ.41,630కి చేరుకుంది.\
అంతర్జాతీయంగా...
అంతర్జాతీయ మార్కెట్లలో పుత్తడి ధర ఔన్సుకు 1,568 డాలర్లుగా ఉంది. వెండి ధర 18.19 అమెరికన్ డాలర్ల వద్ద కొనసాగుతోంది.
మళ్లీ పెరుగుతాయి
పండుగలు, వివాహాల సీజన్ ఉన్నందున బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంతో తలెత్తే పరిణామాల ఆధారంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతికూల ఫలితాలు వెలువడితే బులియన్ ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉందని సమాచారం.