తెలంగాణ

telangana

ETV Bharat / business

వరుసగా మూడోరోజు తగ్గిన పసిడి ధర.. ప్రస్తుతం ఎంతంటే.. - నేటి బంగారం ధరలు

రూపాయి బలపడటం వల్ల బంగారం ధరలు స్వల్పంగా పతనమయ్యాయి.దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల పసిడి రూ.236 తగ్గి రూ.40,432కి చేరింది. కేజీ వెండి రూ.376 తగ్గి రూ.47,635కి చేరుకుంది.

Gold prices decline Rs 236 on global selling, stronger rupee
రూపాయి ప్రభావంతో తగ్గిన బంగారం ధర

By

Published : Jan 13, 2020, 4:51 PM IST

అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టటం వల్ల బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత వారాంతంలో భారీగా తగ్గిన పసిడి, అంతర్జాతీయంగా అమ్మకాలకు మొగ్గుచూపడం సహా రూపాయి బలపడటం వల్ల నేడూ స్వల్పంగా పతనమైంది.

దిల్లీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.236 తగ్గి రూ.40,432కి చేరింది.

పుత్తడి దారిలోనే వెండి సైతం రూ.376 తగ్గింది. దిల్లీలో కిలో వెండి ధర రూ.47,635కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లలో కూడా పసిడి ధరలు క్షీణించాయి. ఔన్సు బంగారం ధర 1,550 అమెరికన్ డాలర్లుగా ఉండగా.. ఔన్సు వెండి ధర 17.97 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇదీ చదవండి: ఐటీ షేర్ల దూకుడు.. జీవితకాల గరిష్ఠానికి సూచీలు

ABOUT THE AUTHOR

...view details