తెలంగాణ

telangana

పెళ్లిళ్ల సీజన్​ కారణంగా బంగారం ధరలకు రెక్కలు

By

Published : Jan 30, 2020, 4:29 PM IST

Updated : Feb 28, 2020, 1:17 PM IST

వరుసగా రెండు రోజులు పతనమైన బంగారం ధరలకు నేడు రెక్కలొచ్చాయి. దిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.400 పెరిగి రూ.41,524కి చేరింది. రూ.737 పెరిగిన కిలో వెండి... రూ.47,392కి చేరుకుంది.

gold price today
పెళ్లిళ్ల సీజన్​ కారణంగా బంగారం ధరలకు రెక్కలు

పెళ్లిళ్ల సీజన్​ డిమాండ్​తో పాటు అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధరలు పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.400 పెరిగి... రూ.41,524కి చేరింది.

కిలో వెండి ధర రూ.737 వృద్ధి చెంది రూ.47,392కి చేరింది.

అంతర్జాతీయం

అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఔన్సు పుత్తడి ధర 1,582 డాలర్లుగా ట్రేడవుతోంది. ఔన్సు వెండి ధర 17.72 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇదీ చదవండి: కరోనా భయంతో నష్టాలు మూటగట్టుకున్న మార్కెట్లు

Last Updated : Feb 28, 2020, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details