తెలంగాణ

telangana

ETV Bharat / business

రూపాయి బలహీనం.. పసిడి ప్రియం

రూపాయి బలహీనపడిన నేపథ్యంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.96 పెరిగి రూ.40,780గా ఉండగా, కిలో వెండి ధర రూ.238 పెరిగి రూ.47,277గా ఉంది.

Gold jumps Rs 96, silver prices climb Rs 238
రూపాయి బలహీనం... పసిడి ప్రియం

By

Published : Jan 24, 2020, 4:37 PM IST

Updated : Feb 18, 2020, 6:14 AM IST

పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.96 పెరిగి రూ.40,780గా ఉంది. కిలో వెండి ధర రూ.238 పెరిగి రూ.47,277గా ఉంది.

కరోనా వైరస్​ చైనాతో పాటు ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో రూపాయి బలహీనపడింది. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు పెరిగాయని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయ మార్కెట్​లో

అంతర్జాతీయ మార్కెట్​లో బంగారం, వెండి ఫ్లాట్​గా ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,558 డాలర్లుగా, ఔన్స్ వెండి ధర 17.80 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: అంతర్జాతీయ సానుకూలతలతో చివరకు లాభాలు

Last Updated : Feb 18, 2020, 6:14 AM IST

ABOUT THE AUTHOR

...view details