బంగారం ధర మంగళవారం రూ.119 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.49,306 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా బలహీన సంకేతాల నేపథ్యంలో.. బంగారమే సురక్షిత పెట్టుబడిగా మదుపరులు భావించడం ధరల పెరుగుదలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.

వెండి ధర ఏకంగా కిలోకు రూ.1,408 (దిల్లీలో) పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.49,483 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,773 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 17.86 డాలర్లకు చేరింది.
ఇదీ చూడండి:చైనా ఫోన్లు మార్చాలా? వీటిపై లుక్కేయండి