తెలంగాణ

telangana

ETV Bharat / business

బంగారం ధరలకు రెక్కలు- ఇవిగో నేటి లెక్కలు... - వెండి

పసిడి ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. దిల్లీలో 10 గ్రాములు స్వచ్ఛమైన బంగారం ధర రూ.50,920 పెరిగింది. అలాగే కిలో వెండి ధర రూ.60,400కి చేరింది.

Gold hits new record high of Rs 50,920 per 10 gm; silver also glitters
బంగారం ధరలకు రెక్కలు వచ్చాయ్​!

By

Published : Jul 22, 2020, 4:57 PM IST

బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.430 పెరిగి రూ.50,920కి చేరింది.

వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. దిల్లీలో కిలో వెండి ధర రూ.2,550 పెరిగి రూ.60,400కి చేరింది.

అంతర్జాతీయంగా..

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్స్ బంగారం ధర 1,855 డాలర్లుగా ఉండగా, ఔన్స్ వెండి ధర 21.80 డాలర్లుగా ఉంది.

సురక్షిత పెట్టుబడుల వైపు..

'కరోనా సంక్షోభం నేపథ్యంలో మదుపరులు... సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గుచూపుతున్నారు. అందువల్ల అంతర్జాతీయంగా పసిడి, వెండి లోహాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీనితో కొనుగోళ్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఫలితంగా భారత్​లోనూ బంగారం ధరలు పెరిగాయని' హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్టు (కమోడిటీస్​) తపన్ పటేల్ తెలిపారు.

ఇదీ చూడండి:వారికి ఏడాది చివరి వరకు వర్క్ ఫ్రం హోం!

ABOUT THE AUTHOR

...view details