తెలంగాణ

telangana

ETV Bharat / business

బంగారం భగభగ- రూ.52వేలకు చేరువ - పది గ్రాముల బంగారం ధర

బంగారం ధర మరోసారి రికార్డు స్థాయికి పెరిగింది. పది గ్రాముల మేలిమి పుత్తడి ధర శుక్రవారం రూ.475 ఎగిసి..రూ.52 వేలకు చేరువైంది. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది.

gold
బంగారం భగభగ.. 10 గ్రాముల ధర కొత్త రికార్డు

By

Published : Jul 24, 2020, 5:25 PM IST

బంగారం ధర శుక్రవారం రూ.475 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రికార్డు స్థాయిలో రూ.51,946 వద్దకు చేరింది.

అంతర్జాతీయంగా పసిడి ధరలు పుంజుకోవడం, రూపాయి బలహీనపడటం వల్ల దేశీయంగా బంగారం ధరలు ఈ స్థాయిలో పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర మాత్రం స్వల్పంగా రూ.109 (దిల్లీలో) తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.62,262 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,897 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 22.70 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:చైనాకు భారత్​ మరో షాక్​- బిడ్డర్లపై ఆంక్షలు!

ABOUT THE AUTHOR

...view details