తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు - పది గ్రాముల బంగారం ధర

బంగారం, వెండి ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దాదాపు రూ.190 ఎగిసింది. వెండి ధర కిలోకు రూ.62,700పైకి చేరింది.

GOLD AND SILVER PRICE TODAY
నేటి బంగారం, వెండి ధరలు

By

Published : Oct 28, 2020, 4:49 PM IST

బంగారం ధర బుధవారం కాస్త పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.190 పెరిగి.. రూ.51,220 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేయడం, రూపాయి విలువ తగ్గుతుండటం వంటి కారణాలతో.. పసిడి ధరలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు రూ.342 పెరిగి. కిలో ధర ప్రస్తుతం రూ.62,712 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో మాత్రం ఔన్సు బంగారం ధర 1,906.70 డాలర్లకు తగ్గింది. వెండి ధర ఔన్సుకు 24.45 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి:నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు- 40వేల దిగువకు సెన్సెక్స్

ABOUT THE AUTHOR

...view details