తెలంగాణ

telangana

ETV Bharat / business

పండుగ వేళ పసిడి పరుగు... రూ.39వేలకు చేరువలో...

పసిడి, వెండి ధరలు నేడు పెరిగాయి. అంతర్జాతీయ సానుకూలతలకు తోడు.. రూపాయి బలపడటం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. దిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.177 పెరిగింది. వెండి కిలోకు రూ.290 వృద్ధి చెందింది.

రూ.39 వేలకు చేరువలో పసిడి.. నేడు ఒక్కరోజే భారీ వృద్ధి

By

Published : Oct 23, 2019, 6:24 PM IST

పండుగ సీజన్ నేపథ్యంలో పసిడి ధర మళ్లీ రూ.39 వేలకు చేరువవుతోంది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర నేడు ఒక్క రోజే రూ.177 వృద్ధితో.. రూ.38,932కి చేరింది. రూపాయి బలపడటం, అంతర్జాతీయ సానుకూలతలతో ధరలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.

బంగారం బాటలోనే వెండి ధరలు పయనించాయి. దిల్లీలో కిలో వెండి ధర నేడు రూ.290 పెరిగి.. రూ.46,560 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్స్ బంగారం ధర 1,493 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 17.57 వద్ద ఉంది.

ఇదీ చూడండి: బీఎస్​ఎన్​ఎల్​, ఎంటీఎన్​ఎల్​పై కేంద్రం వరాల జల్లు

ABOUT THE AUTHOR

...view details