తెలంగాణ

telangana

By

Published : Dec 7, 2020, 3:16 PM IST

ETV Bharat / business

మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు సోమవారం కూడా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తిడి ధర దిల్లీలో రూ.100కు పైగా దిగొచ్చింది. వెండి ధర కిలోకు రూ.63 వేల దిగువకు చేరింది.

Gold price fall
తగ్గిన బంగారం ధర

బంగారం ధర సోమవారం స్వల్పంగా రూ.104 తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.48,703 వద్దకు చేరింది.

అంతర్జాతీయంగా పసిడి ధరలు వరుసగా తగ్గుతూ వస్తుండటం వల్ల ఆ ప్రభావం దేశీయంగానూ పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు (దిల్లీలో) రూ.736 దిగొచ్చింది. కిలో ధర ప్రస్తుతం రూ.62,621 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,836 డాలర్లకు తగ్గింది. వెండి ధర 23.92 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి:జనవరి 31లోపు అందరికీ రీఫండ్: ఇండిగో

ABOUT THE AUTHOR

...view details