తెలంగాణ

telangana

ETV Bharat / business

మళ్లీ తగ్గిన బంగారం ధర.. 10 గ్రాములు ఎంతంటే? - వ్యాపార వార్తలు

పసిడి ధర మళ్లీ తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.35 క్షీణించింది. వెండి మాత్రం కిలోకు రూ.147 పెరిగింది.

GOLD
బంగారం ధర

By

Published : Nov 27, 2019, 5:13 PM IST

పసిడి ధర వరుసగా తగ్గుతూ వస్తోంది. దేశ రాజధాని దిల్లీలో నేడు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.35 తగ్గింది. ప్రస్తుత ధర రూ.38,503కు చేరింది.
రూపాయి బలపడుతుండటం, స్టాక్ మార్కెట్ల జోరు పసిడి ధర తగ్గుదలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.

పుత్తడి ధర తగ్గినా.. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర నేడు (దిల్లీలో)రూ.147 పెరిగి.. రూ.45,345 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లోనూ పసిడి, వెండి ధరలు తగ్గాయి. ఔన్సు బంగారం ధర 1,159 డాలర్లకు చేరింది. వెండి ఔన్సుకు 17.02 డాలర్ల వద్ద ఉంది.

ఇదీ చూడండి:జీఎస్టీ చెల్లించేవారికి కేంద్రం లాటరీ పథకం!

ABOUT THE AUTHOR

...view details