తెలంగాణ

telangana

ETV Bharat / business

పసిడి ధరల జోరుకు బ్రేక్- నేడు ఎంత తగ్గిందంటే...

బంగారం, వెండి ధరల జోరుకు మంగళవారం బ్రేక్ పడింది. పది గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.133 తగ్గింది. వెండి ధర భారీగా తగ్గి.. రూ.64వేల దిగువకు చేరింది.

Gold Price declines
తగ్గిన బంగారం ధర

By

Published : Oct 13, 2020, 3:29 PM IST

బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి మంగళవారం రూ.133 తగ్గి.. రూ.51,989 వద్దకు చేరింది. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ తగ్గటం కారణంగా.. దేశీయంగా ధరలు తగ్గుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర భారీగా పడిపోయింది. కిలోకు రూ.875 తగ్గింది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.63,860 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,919డాలర్లకు తగ్గింది. వెండి ధర ఔన్సుకు 24.89 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి:ఫ్లిప్​కార్ట్, పతంజలిని బంద్​ చేస్తామంటూ నోటీసులు

ABOUT THE AUTHOR

...view details