తెలంగాణ

telangana

ETV Bharat / business

తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తిడి ధర దిల్లీలో రూ.102కు దిగొచ్చింది. వెండి ధర కిలోకు రూ.63 వేల దిగువకు చేరింది.

Gold declines Rs 102 and silver marginally lower on dec 11
మరోసారి దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

By

Published : Dec 11, 2020, 3:58 PM IST

బంగారం ధర శుక్రవారం స్వల్పంగా రూ.102 కు తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.48,594 వద్దకు చేరింది.

పసిడి బాటలోనే వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండిపై రూ.16 తగ్గి, ప్రస్తుత ధర రూ.62,734 వద్దకు చేరింది.

అమెరికాలో ఉద్దీపనల పథకాల కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తుండటం వల్ల ఈ ధరలు తగ్గాయని హెచ్​డీఎఫ్​సీ సీనియర్​ విశ్లేషకులు తపన్​ పటేల్​ తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,836 డాలర్లకు తగ్గింది. వెండి ధర 23.92 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి:మళ్లీ లాభాలు- 46వేల మార్క్ దాటిన సెన్సెక్స్

ABOUT THE AUTHOR

...view details