బంగారం, వెండి ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.83 పెరిగి.. రూ.45,049 వద్దకు చేరింది. అంతర్జాతీయంగా పెరిగిన పుత్తడి ధరలు ఇందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.
పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు స్వల్పంగా రూ.62 పెరిగి.. 64,650 వద్దకు చేరింది.