తెలంగాణ

telangana

By

Published : Jun 14, 2020, 5:15 PM IST

ETV Bharat / business

ఈ వారం స్టాక్ మార్కెట్ల పయనం ఎటు?

స్టాక్ మార్కెట్లు గత వారం ఒడుదొడుకులు ఎదుర్కొని 500 పాయింట్లకు పైగా నష్టాన్ని నమోదు చేశాయి. దేశీయంగా కరోనా కేసులు పెరుగుతుండటం, ఆర్థిక వ్యవస్థపై వస్తున్న అంచనాల నేపథ్యంలో ఈ వారం సూచీలు ఎలా స్పందించనున్నాయి? ట్రేడింగ్​పై నిపుణులు ఏం చెబుతున్నారు?

stock markets this week
ఈ వారం స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లపై ఈ వారం అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా కరోనా కేసులు, కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాల ప్రభావం అధికంగా ఉండనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వీటికి తోడు సోమవారం టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) గణాంకాలు విడుదల చేయనుంది కేంద్ర గణాంకాల కార్యాలయం. ఈ లెక్కల ప్రభావం కూడా మార్కెట్లపై ప్రధానంగా ఉండొచ్చని చెబుతున్నారు విశ్లేషకులు.

"ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలు ఆలస్యమయ్యాయి. స్పష్టమైన అంచనాలతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందా లేదా అనే విషయం తెలిసే వరకు మార్కెట్లు కాస్త నెమ్మదించొచ్చు."

- సిద్ధార్థ్ ఖీమా, మోతీలాల్ ఓశ్వాల్ రిటైల్ రీసెర్చ్ అధిపతి

ఈ వారంలో టాటా మోటార్స్, ఎల్​ఐసీ హౌసింగ్ ఫినాన్స్, ఆయిల్ ఇండియా లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి సంస్థలు త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ ఫలితాలు మదుపురుల సెంటిమెంట్​ను ప్రభావితం చేయొచ్చని నిపుణులు అంటున్నారు.

అంతర్జాతీయంగా చూస్తే బీజింగ్​లో​ కరోనా కేసులు పెరుగుతున్నట్లు చైనా ప్రకటించింది. దేశీయంగా కూడా కొవిడ్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండటం మార్కెట్లకు ప్రతికూల మారే అంశాలుగా చెబుతున్నారు స్టాక్ బ్రోకర్లు.

రూపాయి, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు మార్కెట్లపై ప్రభావం చూపే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చూడండి:ల్యాప్​టాప్​ కొనాలా? టాప్​-6 మోడల్స్​ ఇవే...

ABOUT THE AUTHOR

...view details