తెలంగాణ

telangana

ETV Bharat / business

అంతర్జాతీయ పరిణామాలే ఈ వారం మార్కెట్లకు కీలకం! - స్టాక్ మార్కెట్ అవుట్​లుక్​

ఈ వారం స్టాక్ మార్కెట్లకు అంతర్జాతీయ పరిణామాలు కీలకంగా మారనున్నాయి. దేశీయంగా 2020-21 తొలి త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభమవడం కూడా ట్రేడింగ్​పై ప్రభావం చూపించే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు.

stocks this week
ఈ వారం స్టాక్ మార్కెట్లు

By

Published : Jul 5, 2020, 11:17 AM IST

స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ సెంటిమెంట్​ను ఈ వారం అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా 2020-21 తొలి త్రైమాసిక ఫలితాలు ప్రభావితం చేయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారత్-చైనా సరిహద్దు వివాదం, అంతర్జాతీయ మార్కెట్ల పయనం వంటి వాటిపై మదుపరులు దృష్టి సారించొచ్చని చెబుతున్నారు.

ఐటీ దిగ్గజం టీసీఎస్​ ఈ వారమే క్యూ1 ఫలితాలు ప్రకటించనుంది. హెవీ వెయిట్​ షేర్లలో టీసీఎస్​ కూడా ఒకటైనందున మార్కెట్లపై ఆ ఫలితాల ప్రభావం భారీగా ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు నిపుణులు.

ఐఐపీ డేటా వంటి మాక్రో ఎకానమిక్​ గణాంకాలు ఈ వారం విడుదల కానున్నాయి. ఇవి కూడా ట్రేడింగ్​ను ప్రభావితం చేసే వీలుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండం వంటి పరిణామాలు మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలని మార్కెట్ బ్రోకర్లు అంటున్నారు.

డాలర్​తో రూపాయి మారకం విలువ, ముడిచమురు ధర వంటివి మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చూడండి:పిల్లలకు ల్యాపీలిద్దాం.. సెల్‌ఫోన్‌ కంటే ఇదే మేలేమో!

ABOUT THE AUTHOR

...view details