తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆగని పెట్రో మంట.. మళ్లీ పెరిగిన ధరలు - డీజిల్ ధర

వాహనదారులపై పెట్రో బాదుడు కొనసాగుతోంది. పెట్రోల్​, డీజిల్​ ధర 27 పైసలు పెరిగింది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర​ రూ.86.30, డీజిల్ రూ.76.48గా ఉంది. ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ.92.86, డీజిల్ ధర రూ.83.30గా ఉంది.

petro rates, fuel prices hike
ఆగని పెట్రో మంట.. కొనసాగుతున్న ధరల పెంపు

By

Published : Jan 27, 2021, 8:16 AM IST

చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇంధన ధరలు భగ్గుమంటున్నా.. ధరల పెంపునకే చమురు సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. పెట్రోల్​, డీజిల్​పై లీటరుకు మంగళవారం 35 పైసలు పెంచగా.. బుధవారం మరో 27 పైసలు పెంచాయి. దీంతో దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.86.30, డీజిల్​ రూ.76.48గా ఉంది. ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ.92.86గా ఉండగా, డీజిల్ ధర రూ.83.30గా ఉంది. చమురు ధరలకు అదుపు లేకుండా పోవడం వల్ల వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెట్రో ధరలకు రెక్కలురావడంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధర అప్పటితో పోలిస్తే ఇప్పుడు సగం తగ్గినా.. భారత్​లో ఇంధన ధరలకు అదుపు లేకుండా పోతోందని కాంగ్రెస్ ఇటీవల విమర్శించింది. ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతున్నందు వల్ల పెట్రో ధరలు తగ్గించాలనే డిమాండ్లు పెరిగాయి.

ఇదీ చదవండి :రైతుల 'రణతంత్ర' పరేడ్.. సాగిందిలా..

ABOUT THE AUTHOR

...view details