ఏప్రిల్ 1 నుంచి పలు బ్యాంక్‌ల సేవల్లో భారీ మార్పులు రానున్నాయి. ముఖ్యంగా గత రెండేళ్లలో ఇతర బ్యాంకుల్లో విలీనమైన బ్యాంక్‌ల చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు నిరుపయోగంగా మారనున్నాయి. ఆయా బ్యాంకుల ఐఎఫ్ఎస్సీ, ఎంఐసీఆర్ కోడ్లూ మారనున్నాయి.
విలీనమైన బ్యాంక్‌లు ఇవే..
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండూ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనమయ్యాయి. సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్‌లో విలీనమైంది.
ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లు యూనియన్ బ్యాంక్‌లో విలీనమయ్యాయి. అలహాబాద్ బ్యాంక్ఇండియన్ బ్యాంక్‌లో విలీనమైంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి వీటి విలీనం అమల్లోకి వచ్చింది.