ఆసియా కుబేరుల్లో ప్రథముడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ ఆస్తులు ఎన్ని అంటే.. చెప్పడం ఆంత తేలిక కాదు. ఒకటా.. రెండా.. మసెరటి లేవాంట, బెంట్లీ వంటి కార్లతో మొదలుకొని మరెన్నో విలువైన ఆస్తులు ఆయన సొంతం. వాటన్నింటి కన్నా రిలయన్స్ అధినేతకు చాలా విలువైన నాలుగు అస్తులున్నాయి.
ఆంటిలియా..
ముంబయిలో ముకేశ్ అంబానీ కుటుంబం నివసించే భవనం పేరు ఆంటిలియా. 27 అంతస్తులు ఉంటుంది. 9హై స్పీడ్ ఎలివేటర్లు ఇందులో ఉన్నాయి. గ్రాండ్ బాల్ రూమ్, థియేటర్, దేవాలయం, మరెన్నో గార్డ్సెన్లు ఇందులో ఉన్నాయి.
యూకేలో స్టోక్ పార్క్..
మరో విలువైన ఆస్తి స్టోక్ పార్క్. సినిమాల్లో చూసే ఉంటారు. యూకేలో ఉంది. రిలయన్స్ ఇండిస్ట్రీస్ పేరిట రిజస్టర్ అయ్యింది. 49 బెడ్ రూమ్లు ఉంటాయి. 27 గోల్ కోర్సులు, 13 టెన్నీస్ కోర్టులు, 14 ఎకరాల ప్రైవేట్ గార్డెన్లు దీని సొంతం. దీని విలువ రూ.593 కోట్లు ఉంటుంది.