దసరా, దీపావళి పండగలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అతిపెద్ద సేల్‌కు సిద్ధమైంది. 'బిగ్ బిలియన్ డేస్' పేరిట అక్టోబర్ 16 నుంచి 21 వరకు సేల్ నిర్వహించనుంది. మొత్తం ఆరు రోజుల పాటు సాగే ఈ సేల్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డుదారులకు ప్రత్యేకంగా ఆఫర్లు అందిస్తోంది. ఈ కార్డులు ఉపయోగించి కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్ ఒకరోజు ముందుగానే అంటే 15వ తేదీ నుంచే డీల్స్‌ను పొందొచ్చు.
16 నుంచి ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్' సేల్
షాపింగ్ ప్రియులకు శుభవార్త. బిగ్ బిలియన్ డేస్ పేరిట అక్టోబర్ 16-21 మధ్య భారీ సేల్ నిర్వహించనున్నట్లు తెలిపింది ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్. మొబైళ్లు, టీవీలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు లభించనున్నట్లు పేర్కొంది. ఎస్బీఐ కార్డుదారులకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది.
బజాజ్ ఫిన్ సర్వ్ ఈఎంఐఐ కార్డులు, ఇతర ప్రముఖ బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులపైనా నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. పేటీఎం వ్యాలెట్, పేటీఎం యూపీఐ కొనుగోళ్లపై క్యాష్ బ్యాక్ ఇవ్వనుంది. మొబైళ్లు, టీవీలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర ఉత్పత్తులపై ఫ్లిప్‌కార్ట్ తన సేల్‌లో డిస్కౌంట్లు అందిస్తోంది. ఇప్పటికే తన వెబ్‌సైట్‌లో కొన్ని ఆఫర్లను పొందుపరిచింది.
'బిగ్‌బిలియన్ డేస్' వల్ల 70 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని, మరో లక్ష మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఆశిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. అలాగే వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఇప్పటికే అమితాబ్, విరాట్ కోహ్లీ, అలియా భట్, రణ్‌బీర్ కపూర్, సుదీప్ కిచ్చా, మహేశ్ బాబు తదితరులతో ఒప్పందం చేసుకుంది. మరోవైపు అమెజాన్ సైతం 'గ్రేట్ ఇండియన్ సేల్' నిర్వహించనుంది. త్వరలోనే తేదీలు ప్రకటించనుంది. దాదాపు ఇదే తేదీల్లో సేల్ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.