తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇకపై తెలుగులోనూ ఫ్లిప్​కార్ట్ షాపింగ్

ప్రాంతీయ వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్ సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా సులభంగా ఆన్​లైన్ షాపింగ్ చేసేందుకు వీలుగా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఫ్లిప్​కార్ట్ సేవలను ప్రారంభించింది.

By

Published : Jun 24, 2020, 5:46 PM IST

flipkart services in Telugu
తెలుగులో ఫ్లిప్​కార్ట్ సేవలు

దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్..​ వినియోగదారులకు మరింత దగ్గరయ్యేందుకు మూడు ప్రాంతీయ భాషల్లో ప్లాట్​ఫాంను అందుబాటులోకి తెచ్చింది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సేవలు అందుబాటులోకి వచ్చినట్లు ఫ్లిప్​కార్ట్ ప్రకటించింది.

ప్రాంతీయ భాషల్లో సేవలు అందుబాటులోకి రావడం వల్ల ఎక్కువ మంది సులభంగా తమ సేవలు వినియోగించుకుంటారని భావిస్తోంది ఫ్లిప్​కార్ట్​.

తొలుత ఇంగ్లీష్​లో మాత్రమే సేవలందించిన ఫ్లిప్​కార్ట్.. గత ఏడాది హిందీని చేర్చింది. దక్షిణాది రాష్ట్రాలపై పట్టుకోసం ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సేవలు ప్రారంభించింది.

ప్రాంతీయ భాషల్లో సేవలను అందించేందుకు విశాఖపట్నం, మైసూర్ వంటి నగరాల్లో అధ్యయనం చేసినట్లు ఫ్లిప్​కార్ట్ వెల్లడించింది.

ఇదీ చూడండి:హిందుజా సోదరుల మధ్య ఆస్తి వివాదం!

ABOUT THE AUTHOR

...view details