దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ నుంచి 'బిగ్ సేవింగ్ డేస్' సేల్ శనివారం అర్ధరాత్రి నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ స్పెషల్ సేల్ 29 వరకు నిర్వహించనున్నట్లు సంస్థ తెలిపింది. ఫ్లిప్కార్ట్ ప్లస్ యూజర్లకు శుక్రవారం నుంచే ఈ సేల్ అందుబాటులో ఉంది. ప్రముఖ బ్రాండ్ల మీద భారీగా డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. మొబైల్ ఫోన్లు, లాప్టాప్లు, స్పీకర్లు, స్మార్ట్ వాచ్లు ఇతర ఎలక్ట్రికల్ వస్తువులపై భారీగా ఆఫర్లు ప్రకటించింది.
ఈ సేల్లో ఏఏ బ్రాండ్ మొబైల్ ఫోన్లపై ఎంతమేర తగ్గింపు ఉంటుంది అనేది ఓ సారి చూద్దాం.
యాపిల్ ఐఫోన్ 12 మిని (64 జీబీ)
ప్రస్తుత ధర- రూ. 69,900
ఆఫర్ ధర- రూ 57,999
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్.
యాపిల్ ఐఫోన్ 12 (64 జీబీ)
ప్రస్తుత ధర- రూ. 79,900
ఆఫర్ ధర- రూ 67,999
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్.
మోటరోలా ఆర్ఏజేఆర్ (6జీబీ, 128 జీబీ)
ప్రస్తుత ధర- రూ. 1,49,999
ఆఫర్ ధర- రూ 54,999
ఆసిస్ రోగ్ ఫోన్ 3 (8జీబీ ర్యామ్)
ప్రస్తుత ధర- రూ. 55,999
ఆఫర్ ధర- రూ 39,999