సార్వత్రిక ఎన్నికల ముగింట జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించింది ఫిచ్ రేటింగ్ సంస్థ. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 7 శాతం ఉంటుందన్న అంచనాలను 6.8 శాతంగా సవరించింది.
"వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నాం. దేశంలో అనుకున్న దాని కంటే అభివృద్ధి కొంచెం నెమ్మదించటమే ఇందుకు కారణం. 2020 ఆర్థిక సంవత్సరానికి 6.8 శాతం, 2021 ఆర్థిక సంవత్సరానికి 7.1 గా ఉండే అవకాశముంది" అని తాజా "గ్లోబల్ ఎకనామిక్ ఔట్లుక్" నివేదికలో పేర్కొంది ఫిచ్.
*కేంద్ర గణాంక సంస్థ ఈ ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
ఫిచ్ ప్రకటించిన జీడీపీ అంచనాలు:
సంవత్సరం | గత జీడీపీ వృద్ధి అంచనా | కొత్త అంచనాలు |
2019 | 7.2 | 6.9 |
2020 | 7 | 6.8 |
2021 | 7.3 | 7.1 |
ప్రపంచం సంగతి:
ప్రపంచ జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించింది ఫిచ్.
సంవత్సరం | గతంలో వృద్ధి రేటు అంచనా | కొత్త అంచనాలు |
2018 | 3.3 | 3.2 |
2019 | 3.1 | 2.8 |