"కరోనా నుంచి రక్షించే మాస్క్ ఇదే... స్టాక్ చాలా తక్కువ ఉంది... వెంటనే త్వరపడండి"... ఇలాంటి యాడ్లు ఆన్లైన్లో ఎక్కడో చోట చూసే ఉంటారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ను బూచిగా చూపి, వ్యాపారం పెంచుకునేందుకు ఇలాంటి తప్పుడు యాడ్లు ఇస్తున్నారు కొందరు. అలాంటి మోసపూరిత ప్రకటనలపై నిషేధం విధించింది ఫేస్బుక్.
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉపకరించే ఉత్పత్తులని చెప్పే ప్రకటనలనూ నిషేధిస్తున్నట్లు ప్రకటించింది ఫేస్బుక్. ఉదాహరణకు... "కరోనా నుంచి 100శాతం రక్షణ ఇచ్చే మాస్క్" అనే యాడ్లనూ ఇవ్వడం లేదని వివరించింది.