తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు- ఏ నగరంలో ఎంతంటే.. - డీజిల్ ధరలు
దేశంలో పెట్రోల్, డీజిల్ (Fuel prices today) ధరలు కాస్త తగ్గాయి. లీటర్ పెట్రోల్ ధర (Petrol price today) 10 నుంచి 17 పైసల మధ్య దిగొచ్చింది. డీజిల్ ధర (Diesel Price today) కూడా 16 పైసల మేర తగ్గింది. హైదరాబాద్ సహా ఇతర ప్రధాన నగరాల్లో ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి.
పెట్రోల్ ధరలు
By
Published : Sep 5, 2021, 10:26 AM IST
వరుసగా ఏడు రోజుల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం అతి స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పెట్రోల్ ధరలు (Petrol price today) కనీసం 10 పైసల నుంచి 17 పైసల వరకు దిగొచ్చాయి. ఇదే సమయంలో డీజిల్ ధరలు కూడా(Diesel Price today) దాదాపు 16 పైసల వరకు తగ్గాయి.
దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ఆదివారం 16 పైసలు తగ్గి రూ.101.23 వద్దకు చేరింది. డీజిల్ ధర లీటర్ 16 పైసలు దిగొచ్చింది. దీనితో డీజిల్ ధర ప్రస్తుతం 88.66 వద్ద ఉంది.
అంతర్జాతీయంగా తగ్గిన ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు తెలిపాయి.
దేశంలోని ఇతర ప్రధాన మెట్రో నగరాల్లోనూ.. పెట్రోల్ ధర (Petrol price in Metro Cities) లీటర్కు 12-17 పైసల మధ్య తగ్గింది. లీటర్ డీజిల్ ధరను (Diesel price in Metro cities) 14 పైసల నుంచి 17 పైసల వరకు తగ్గించాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.