వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వు బ్యాంకు ద్రవ్యపరపతి విధానం ప్రకటించడం మదుపర్లను నిరాశకు గురిచేసింది. ఫలితంగా వారు అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. సెన్సెక్స్ 80 పాయింట్ల నష్టంతో 40 వేల 770 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 30 పాయింట్లు తగ్గి 12 వేల 10 వద్ద కొనసాగుతోంది.
ఆర్బీఐ నిర్ణయంతో నిరాశ- నష్టాల్లోకి సూచీలు - Equities trade higher in opening deals ahead of RBI policy decision
12:19 December 05
09:48 December 05
ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు, అమెరికా-చైనా వాణిజ్య చర్చలు ఒప్పందం దిశగా సాగుతున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 80 పాయింట్లు లాభపడి 40, 931 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 24 పాయింట్లు వృద్ధిచెంది 12,067వద్ద కొనసాగుతోంది.
లాభాల్లో ఉన్న షేర్లు
జీ లిమిటెడ్, టైటాన్, హీరో, అల్ట్రా సిమెంట్, టీసీఎస్, తేజాస్ నెట్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
నష్టాల్లో ఉన్న షేర్లు
హెచ్‌సీఎల్, ఎస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, కోల్ ఇండియా, సన్‌ఫార్మా, జేపీ అసోసియేట్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
బలపడిన రూపాయి
డాలరు మారకంతో పోలిస్తే రూపాయి విలువ 25 పైసలు బలపడి 71.65గా ఉంది.
TAGGED:
markets