తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆగస్టులో 14.81 లక్షల కొత్త చందాదార్లు: ఈపీఎఫ్‌ఓ - ఈపీఎఫ్​ఓ న్యూస్ టుడే

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ​లో(ఈపీఎఫ్​ఓ)​ కొత్త చేరికలు భారీగా పెరిగాయి. 2021 జులైతో పోలిస్తే ఆగస్టులో 12.61 శాతం పెరిగినట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఈపీఎఫ్​ఓ డేటాను విడుదల చేసింది.

epfo
ఈపీఎఫ్‌ఓ

By

Published : Oct 21, 2021, 5:35 AM IST

గత ఆగస్టులో 14.81 లక్షల మంది కొత్త చందాదార్లు జతయ్యారని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో నికర ఉద్యోగాల్లో వృద్ధి ధోరణి కనిపిస్తోందని పేర్కొంది. 2021 జులైలో జతయిన చందాదార్లతో పోలిస్తే ఆగస్టులో 12.61 శాతం మేర వృద్ధి నమోదైంది. ఆగస్టు నాటి 14.81 లక్షల మంది నికర చందాదార్లలో, 9.19 లక్షల మంది తొలిసారిగా ఈపీఎఫ్‌ఓ సామాజిక భద్రత పథకంలోకి వచ్చారని తెలిపింది.

5.62 లక్షల మంది నికర చందాదార్లు ఈపీఎఫ్‌ఓను వదిలి, కొత్త ఉద్యోగాల ద్వారా మళ్లీ పథకంలోకి వచ్చినట్లు తెలిపింది. 22-25 ఏళ్ల మధ్య వయసున్న వారు 4.03 లక్షల మంది ఆగస్టులో కొత్తగా నమోదు చేసుకోగా, 18-21 ఏళ్ల మధ్య ఉన్న వారు 3.25 లక్షల మంది నమోదు చేసుకున్నారని ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details