తెలంగాణ

telangana

ETV Bharat / business

EPF Transfer Online: ఈజీగా ఈపీఎఫ్‌ బదిలీ చేయండిలా.. - ఆన్​లైన్​లో ఈఫీఎఫ్ బదిలీ

EPF Transfer Online: ఒక కంపెనీ నుంచి కొత్త సంస్థకు మారినప్పుడు ఉద్యోగులు తమ ఉద్యోగ భవిష్య నిధిని (ఈపీఎఫ్) తప్పనిసరిగా బదిలీ చేసుకోవాలి. అయితే ఈపీఎఫ్​ బదిలీ పక్రియ తెలియకపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. ఈపీఎఫ్​ కార్యాలయం చుట్టూ తిరుగుతారు. అయితే ఇప్పుడా పని లేదు. ఆన్​లైన్​లో ఈపీఎఫ్​ను సులభంగా బదిలీ చేయవచ్చు.

EPF Transfer Online
EPF Transfer Online

By

Published : Dec 27, 2021, 2:00 PM IST

EPF Transfer Online: ఉద్యోగులు ఎవరైనా ఓ సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు తమ ఉద్యోగ భవిష్య నిధిని (ఈపీఎఫ్)​ బదిలీ చేసుకోవాలి. గతంలో ఈ పని చేయడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చేది. ఈపీఎఫ్​ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే డిజిటలైజేషన్‌ పుణ్యమా అని ఇప్పుడా పని తప్పింది. ఇంటి వద్దే ఉండి సులభంగా ఈపీఎఫ్​ను బదిలీ చేసుకునే వెసులుబాటు ఉంది.

ఈపీఎఫ్‌ బదిలీ చేయడమెలా?

  1. తొలుత ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface లోకి వెళ్లి.. మీ యూఏఎన్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాలి.
  2. 'ఆన్‌లైన్‌ సర్వీసెస్‌'లో ఖాతా బదిలీ అభ్యర్థన కోసం 'వన్‌ మెంబర్‌-వన్‌ ఈపీఎఫ్‌ అకౌంట్‌' ఎంచుకోవాలి.
  3. తర్వాత మీ ప్రస్తుత వ్యక్తిగత, పీఎఫ్‌ ఖాతా సమాచారం సరి చూసుకోవాలి.
  4. ఇదే ఫారమ్‌లో కింద యూఏఎన్‌ లేదా పాత ఈపీఎఫ్‌ సభ్యత్వ ఐడీని మరోసారి ఎంటర్‌ చేస్తే మీ ఖాతా వివరాలు కనిసిస్తాయి.
  5. తర్వాత ప్రస్తుత, పాత సంస్థల్లో దేనికి ఖాతా బదిలీ చేయాలనుకుంటున్నారో ఎంటర్‌ చేసి 'గెట్‌ డిటెల్స్‌'పై ఓటీపీ కోసం క్లిక్‌ చేయాలి.
  6. యూఏఎన్‌ రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీనీ నమోదు చేసి సబ్​మిట్​ బటన్​పై క్లిక్​ చేయాలి.

మీరు ఓటీపీ ఎంటర్‌ చేసిన తరువాత ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ ప్రాసెస్‌ అభ్యర్థన మీ సంస్థకు చేరుతుంది. మీ కంపెనీ ధ్రువీకరణ తర్వాత ఈపీఎఫ్​ఓ.. మీ ఈపీఎఫ్​ ఖాతాను ఆన్‌లైన్‌లో బదిలీ చేస్తుంది. ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ మెనూలోని 'ట్రాక్‌ క్లెయిమ్‌ స్టేటస్‌' ఆప్షన్‌ ద్వారా మీ ఈపీఎఫ్‌ బదిలీ స్థితిని తెలుసుకోవచ్చు.

ఈపీఎఫ్​ ఖాతాను ఎందుకు బదిలీ చేసుకోవాలి?

ఈపీఎఫ్​ నగదు ఉపసంహరించుకున్నప్పుడు పన్ను మినహాయింపు పొందాలంటే నిరంతరాయంగా కనీసం ఐదేళ్లు ఉద్యోగం చేసి ఉండాలి. ఒకే సంస్థలో అయినా, వేర్వేరు కంపెనీల్లో అయినా ఐదేళ్లు పని చేసి తీరాలి. ఈపీఎఫ్​ ఖాతా బదిలీ చేయకపోతే గత యజమానుల వద్ద పని చేసిన వ్యవధిని ఈపీఎఫ్​ ఖాతా సర్వీసులో లెక్కించరు. దీనివల్ల పాత ఈపీఎఫ్​ ఖాతాలో వచ్చిన మొత్తం, దానిపై వచ్చిన వడ్డీపై పన్ను విధిస్తారు. ఫలితంగా మీరు నష్టపోవాల్సి వస్తుంది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details