తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఏ 380' తయారీకి ఎయిర్​బస్​ గుడ్​బై - EMIRATS

ప్రతిష్ఠాత్మక 'ఏ 380 సూపర్​ జంబో' విమాన నిర్మాణాన్ని నిలిపివేసిన ఎయిర్​బస్​ సంస్థ.

'ఏ 380' తయారీకి ఎయిర్​బస్​ గుడ్​బై

By

Published : Feb 14, 2019, 9:34 PM IST

Updated : Feb 14, 2019, 11:36 PM IST

'ఏ 380' తయారీకి ఎయిర్​బస్​ గుడ్​బై
సూపర్​ జంబో 'ఏ 380' విమాన తయారీని నిలిపిపేస్తున్నట్లు ఐరోపాకు చెందిన భారీ విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్​ గురువారం ప్రకటించింది. 2021లో ఏ380 చివరి విమానాన్ని అందించనున్నామని సంస్థ​ పేర్కొంది.

ఏ 380కి పెద్ద వినియోగదారుగా ఉన్న ఎమిరేట్స్ తమ ఆర్డర్లను తగ్గించింది. దీంతో తమకు కొత్తగా ఎలాంటి ఆర్డర్లు లేవని ఎయిర్​బస్​ తెలిపింది.

ఎయిర్ బస్​ తీసుకున్న ఈ నిర్ణయం ప్రత్యర్థి కంపెనీ 'బోయింగ్​'కు అనుకూలంగా మారనుంది.

ఒక సారి 500 మందిని తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఏ 380 విమానం.. 2008లో మొదటి సారి నింగిలోకి ఎగిరింది.

Last Updated : Feb 14, 2019, 11:36 PM IST

ABOUT THE AUTHOR

...view details