జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ నరేశ్ గోయల్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు అధికారులు. ఆస్తుల వివరాలపై ఆరా తీశారు. గతంలో విదేశీ మారక నిర్వహణ చట్టం(ఫెమా) కింద ఈడీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేసి ప్రశ్నించారు.
గతంలోనూ...
తాజాగా ముంబయిలోని ఓ ట్రావెల్ సంస్థను గోయల్ మోసం చేసినట్లు అందిన ఫిర్యాదుతో ముంబయి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. గోయల్ నివాసంలో బుధవారం రాత్రి సోదాలు నిర్వహించిన అధికారులు.. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం గోయల్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గతంలోనూ గోయల్, ఆయన కుటుంబ సభ్యులపై ఇటువంటి దాడులే నిర్వహించింది ఈడీ.