తెలంగాణ

telangana

ETV Bharat / business

ఓట్ల పండుగతో సూచీల జోరు - స్టాక్స్​

ఎన్నికల ముందు భారీగా కొనుగోళ్లు జరుపుతున్నారు పెట్టుబడి దారులు. దీనికి తోడు అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో దేశీయ సూచీలు జోరు మీదున్నాయి.

దేశీయ సూచీలు

By

Published : Mar 12, 2019, 10:52 AM IST

ఎన్నికల ముందు పెట్టుబడిదారుల కొనుగోళ్లతో స్టాక్​ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలూ కలిసొచ్చాయి. చమురు, గ్యాస్, బ్యాంకింగ్​ రంగాల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరుగుతున్నాయి.

ప్రస్తుతం సెన్సెక్స్​ 346 పాయింట్ల లాభంతో 37,400 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 86 పాయింట్ల వృద్ధితో 11,254 వద్ద కొనసాగుతోంది.

లాభాల్లో ఉన్నవివే:

పవర్​ గ్రిడ్​, ఎన్టీపీసీ, ఆర్​ఐఎల్​, ఎల్​ & టీ, ఐసీఐసీఐ బ్యాంక్​, టాటా మోటార్స్​, హెచ్​సీఎల్​, వేదాంత.

నష్టాల్లోనివి ఇవే:

భారతీ ఎయిర్​టెల్​, ఇండస్​ లాండ్​ బ్యాంకు షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

లాభాలకు కారణాలివే:

⦁ విదేశీ పెట్టుబడుల ప్రవాహం

⦁ ఆసియా మార్కెట్ల లాభాల పరుగు

⦁ ఎన్నికల ముందు ఉండే కొనుగోళ్ల సెంటిమెంట్​

⦁ అంతర్జాతీయ సానుకూలత

ABOUT THE AUTHOR

...view details