టెలికాం సేవల రంగంలో ఆటోమేటిక్ మార్గంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. అయితే ఈ విదేశీ పెట్టుబడులు నియమ నిబంధనలకు లోబడి ఉంటాయని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) తెలిపింది.
టెలికాం రంగంలో 100% ఎఫ్డీఐ- నోటిఫై చేసిన కేంద్రం - టెలికాం రంగంలో 100 శాతం పెట్టుబడులు
టెలికాం రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. అయితే ఈ పెట్టుబడులు నిబంధనలకు లోబడే ఉంటాయని స్పష్టం చేసింది.
టెలికాం సేవల రంగంలో విదేశీ పెట్టుబడులు
ప్రభుత్వ ముందస్తు ఆమోదం అనుమతితోనే ఈ పెట్టుబడులను పెట్టాల్సి ఉంటుంది. అలాగే భారత్తో సరిహద్దు పంచుకున్న దేశాల కంపెనీలు, వ్యక్తులు.. ప్రభుత్వం ద్వారా మాత్రమే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి:జియో సేవలకు అంతరాయం- యూజర్లకు ఇబ్బందులు!