దేశీయ విమానయాన రంగం వచ్చే 2- 3 నెలల్లో సాధారణ స్థితికి వస్తుందని పౌర విమానయాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వల్ల ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల నుంచి కొలుకుంటున్న ప్రధాన రంగాల్లో విమానయానం కూడా ఒకటని ఫిక్కీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సదస్సులో వెల్లడించారు.
కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా 2020 మార్చి 25న విమాన సేవలను నిలిపివేసింది కేంద్రం. దీనితో విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలోకి జారుకుంది. మే 25 నుంచి దశల వారీగా సేవలను పునరుద్ధరించింది.