ఏప్రిల్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మారుతీ సుజుకీకి చెందిన వేగనార్ అగ్రస్థానంలో నిలిచింది. తొలి పది కార్లలో మారుతీ సుజుకీకి చెందినవే అత్యధికంగా ఉండగా.. తరువాతి స్థానంలో హ్యుందాయ్ నిలిచింది. వాహన సంబంధిత విషయాలపై సమగ్ర విశ్లేషణ జరిపే జాటో డైనమిక్స్ ఇండియా వివరాల ప్రకారం.. ఏప్రిల్‌లో మారుతీ సుజుకీకి చెందిన వేగనార్ 18,656 యూనిట్లు, స్విఫ్ట్ 18,316 యూనిట్లు, ఆల్టో 800.. 17,303, బాలెనో 16,384, డిజైర్ 14,073, ఈకో 11,469, విటారా బ్రెజా 11,220 యూనిట్లు అమ్ముడయ్యాయి.
ఏప్రిల్‌లో అత్యధికంగా అమ్ముడైన కారేదో తెలుసా? - మారుతీ సుజుకీ
ఏప్రిల్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్లలో వేగనార్ అగ్రస్థానంలో నిలిచింది. తొలి పది కార్లలో మారుతీ సుజుకీకి చెందినవే ఎక్కువగా ఉన్నాయి. ఆ తరువాతి స్థానంలో హ్యుందాయ్ నిలిచింది.
వేగనార్
ఇక హ్యుందాయ్‌కు చెందిన గ్రాండ్ ఐ10 నియోస్ 11,540 యూనిట్లు, వెన్యూ 11,245, క్రెటా 12,463 యూనిట్లను విక్రయించారు. ఏప్రిల్‌లో అమ్ముడైన ప్రయాణికుల వాహనాల్లో 50 శాతం వాటా ఈ పది కార్లదే కావడం విశేషం.
ఇదీ చదవండి:బైక్ కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి!