అమ్మ పోపు డబ్బాల్లో చిల్లర దాయడం, అత్యవసర సమయాల్లో వాటిని వినియోగించడం చిన్నతనంలో మీరు చేసే ఉంటారు. పొదుపు అనే పక్రియకు బీజం పడేది అక్కడి నుంచే. అయితే సరైన చోట మీరు సొమ్మును పెట్టుబడి పెడితే.. అటు పొదుపుతో పాటు మీకు వడ్డీల రూపంలో లాభమే లాభం.
కొంత మంది సరైన దిశానిర్దేశం లేక ఎక్కడపడితే అక్కడ పెట్టుబడులు పెట్టి సొమ్ము పోగొట్టుకుంటారు. మరికొందరు అసలు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక గందరగోళానికి గురవుతుంటారు. మరి ఎలా పొదుపు చేయాలో, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ పెట్టుబడి సూత్రాలు మీ కోసమే!
పెట్టిన పెట్టుబడికి ఎలాంటి రిస్క్ లేకుండా అత్యధిక వడ్డీ రావాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇలా మీ పెట్టుబడికి రక్షణ కల్పిస్తూ అత్యధిక వడ్డీనిచ్చే మార్గాలవి:
1. స్టాక్ మార్కెట్లు
స్టాక్‌మార్కెట్‌పై మంచి అవగాహన ఉంటే వారి బ్యాంకు ఖాతాలో సొమ్ము ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. ఎలాంటి షేర్ ఎంచుకోవాలి, ఏ సమయంలో వాటాల అమ్మకాలు జరపాలి అనే విషయాలపై స్పష్టమైన అవగాహన అవసరం.
లాభాలు రావాలంటే
- మార్కెట్లో నిపుణులకు కొదవ లేదు. ఎలాంటి నిపుణుడిని ఎన్నుకునారనే దానిపై మీకు వచ్చే లాభం ఆధారపడి ఉంటుంది.
- సరైన అవగాహన లేకుండా... సొంత ప్రయోగాలు వద్దు.
- మొదట కొద్దికొద్దిగా పెట్టుబడులు పెట్టాలి. అనుభవం గడించే కొద్దీ పెట్టుబడి పరిమితి పెంచుకుంటూపోవచ్చు.
2. మ్యూచువల్ ఫండ్స్
రిస్కు తక్కువ ఉన్న చోట పెట్టుబడి పెట్టాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్‌ను ప్రయత్నించవచ్చు. అయితే వీటిలో సూచీల ఆధారంగా వడ్డీ అందించే రిస్క్ మ్యుూచువల్ ఫండ్స్ (ఈక్విటీ ఫండ్స్), రిస్క్‌లేని ఫండ్స్ (డెబిట్ ఫండ్స్) ఉంటాయి.
- రిస్క్ మ్యూచువల్ ఫండ్స్‌లో లాభ, నష్టాలు సమానంగా ఉంటాయి.
- వివిధ సంస్థలు మ్యూచువల్ ఫండ్స్ అందిస్తున్నాయి. వీటిలో ఈక్విటీ, డెబిట్ ఫండ్స్ రెండూ ఉంటాయి.
- అయితే పెట్టుబడికి డెబిట్ ఫండ్స్ ఎంచుకోవడమే ఉత్తమం.
3. జాతీయ పింఛను విధానం (ఎన్పీఎస్)
దీర్ఘకాల పెట్టుబడికి అత్యుత్తమ పథకం. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ దీనిని ప్రవేశపెట్టింది. ఇందులో రిస్క్ అనే పదానికి స్థానం లేదు.
4. భవిష్య నిధి