ప్రతి ఒక్కరికీ సాంకేతిక పరిజ్ఞాన ప్రయోజనాలు లభించేలా డెవలపింగ్ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసేటప్పుడు డెవలపర్లు బాధ్యతతో మెలగాలని, నీతి, నమ్మకాన్ని పెంపొందించుకోవాలని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సూచించారు. బెంగళూరులో ఫ్యూచర్ డీకోడెడ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... డెవలపర్లకు ఈ విలువైన సూచనలు చేశారు.
డెవలపర్లు విభిన్న జట్లతో కలిసి పనిచేయాలని, అప్పుడే కృత్రిమ సాంకేతికతను (ఏఐ) అభివృద్ధి చేయడానికి ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా ఉంటుందని సత్య నాదెళ్ల తెలిపారు.
"సాంకేతిక పరిజ్ఞానం మన నిత్య జీవితంలో ఓ భాగమైపోతోంది. ఈ విషయంలో మనకు ఎంతో బాధ్యత కూడా ఉంది. మనం సృష్టించకుంటున్న ఈ కొత్త ప్రపంచం కోసం చేసే ప్రతి డిజైన్ విషయంలో డెవలపర్లు, బృందాలు నీతిని పాటించాల్సిన అవసరం ఉంది."