DMART RESULTS: డీమార్ట్ పేరిట రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ మూడో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 23 శాతం పెరిగి.. రూ.552.53 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని పొందింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.446.95 కోట్లుగా ఉన్నట్లు బీఎస్‌ఈ ఫైలింగ్‌లో అవెన్యూ సూపర్ మార్ట్స్ పేర్కొంది.
సమీక్షిస్తున్న త్రైమాసికంలో ఆపరేషన్స్ ద్వారా 22.22 శాతం వృద్ధితో రూ.9,217.76 కోట్ల ఆదాయం సముపార్జించినట్లు అవెన్యూ సూపర్‌మార్ట్స్ తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.7,542 కోట్లు కావడం గమనార్హం.