Cryptocurrency falling down: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీలు కుదేలవుతున్నాయి. ఇందుకు ఒమిక్రాన్ పరిణామాలకు తోడు భారత పరిణామాలు సైతం తోడయ్యాయి. కేవలం కొద్ది రోజుల్లోనే 38కి పైగా దేశాల్లో ఒమిక్రాన్ జాడలు కనిపించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లు నష్టపోయాయి. భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసులు బయటపడగా శుక్రవారం మన సూచీలు సైతం నేలచూపులు చూశాయి. మరో వైపు, భారత్ క్రిప్టో కరెన్సీని క్రిప్టో అసెట్‌గా పేరు మార్చి, మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ కిందకు తీసుకురావాలని గట్టిగా భావిస్తుండడం వల్ల క్రిప్టో కరెన్సీ సెంటిమెంటు దెబ్బతిన్నట్లుంది. మరో వైపు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ కఠిన ఆంక్షల వైపు మళ్లడమూ బలహీనతలను తెచ్చిపెట్టింది.
గంటలో 10,000 డాలర్లు కోల్పోయి..
Bitcoin bear market: అత్యంత ప్రజాదరణ ఉన్న క్రిప్టో కరెన్సీలైన బిట్‌కాయిన్, ఈథర్‌లు శనివారం నాటి మార్కెట్లో దిగాలు పడ్డాయి. ఒక దశలో బిట్ కాయిన్ 42,000 డాలర్ల దిగువకు; ఈథర్ 3,500 డాలర్ల దిగువకు చేరుకున్నాయి. ఈ రెండూ 16శాతం, 15 శాతం వరకు నష్టాలను చవిచూశాయి. బిట్ కాయిన్ విషయానికొస్తే శనివారం ఒక గంట వ్యవధిలోనే 10,000 డాలర్ల మేర నష్టపోయింది. ఆ తర్వాత కోలుకుని 48,000 డాలర్ల వద్ద తచ్చాడింది. ఈథర్ కూడా తర్వాత కోలుకుని 3900 డాలర్లకు చేరుకుంది. ఈ రెండూ ఒమిక్రాన్ వేరియంట్ వార్తలు వచ్చినప్పటి నుంచీ అంతర్జాతీయ మార్కెట్లతో పాటే హెచ్చుతగ్గులు చవిచూస్తూ వచ్చాయి. నవంబరు 10న 69,000 డాలర్ల వద్ద ఆల్‌టైం గరిష్ఠాన్ని చూసిన బిట్ కాయిన్ ఇపుడు 30శాతం దిగువన చలిస్తోంది. సాధారణంగా ఆల్‌టైం గరిష్ఠాల నుంచి 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ పడితే దాన్ని బేర్‌మార్కెట్‌గా పరిగణిస్తుంటారు. అంటే బిట్ కాయిన్ మార్కెట్ ఇపుడు బేర్ చేతుల్లో చిక్కిందన్నమాట. కార్డనో, సొలానా, పాలీగాన్, షిబా ఇను వంటి క్రిప్టోకరెన్సీలు సైతం 13-20 శాతం వరకు నష్టాలను చవిచూశాయి.
ఇదీ చూడండి:బిట్‌కాయిన్‌పై 'బేర్' పంజా.. ప్రభుత్వ నియంత్రణే కారణం!
Nirmala sitharaman on crypto: