కొవాగ్జిన్ టీకా ఎగుమతులను (covaxin export from india) ప్రారంభించినట్లు ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ (bharat biotech covaxin) వెల్లడించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎగుమతుల ఆర్డర్లకు నవంబర్‌లో సరఫరా ప్రారంభించినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపింది. రాబోయే రోజుల్లో ఎగుమతులను మరింత పెంచుతామని పేర్కొంది.
విదేశాలకు కొవాగ్జిన్ ఎగుమతి ప్రారంభం
నవంబర్‌లో విదేశాలకు కొవాగ్జిన్ ఎగుమతులు (covaxin export news) ప్రారంభించినట్లు భారత్ బయోటెక్ తెలిపింది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎగుమతుల ఆర్డర్లను సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది. ఎగుమతులకు అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పింది.
కొవాగ్జిన్ ఎగుమతి
చాలాదేశాల్లో అత్యవసర వినియోగానికి కొవాగ్జిన్‌కు అనుమతి లభించిందన్న భారత్ బయోటెక్.. డిసెంబర్ నుంచి మరిన్ని దేశాలకు కొవాగ్జిన్ టీకాలను ఎగుమతి చేయనున్నట్లు తెలిపింది. కొవాగ్జిన్ ఎగుమతులకు అనుమతి ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు చెప్పింది. కొవిడ్‌కి వ్యతిరేకంగా ప్రపంచం జరుపుతున్న పోరులో కొవాగ్జిన్ అంతర్భాగమైందని పేర్కొంది.
ఇదీ చూడండి:India Omicron News: 'సిద్ధంగా ఉండండి'.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ