అమెరికా వంటి మార్కెట్లలో డిమాండ్ పుంజుకుంటున్న నేపథ్యంలో మే నెలలో చైనా ఎగుమతులు 28 శాతం పెరిగాయి. ఇదే సమయంలో దిగుమతులు 51 శాతం పెరిగాయి. అయితే కరోనా వల్ల గత ఎడాది ఎగుమతులు, దిగుమతులు భారీగా క్షీణించిన నేపథ్యంలో ఈ సారి ఆ దేశ వృద్ధి సమం అవుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
మే నెలలో చైనా ఎగుమతుల విలువ 263.9 బిలయన్ డాలర్లుగా నమెదవగా.. దిగుమతుల విలువ 218.4 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు కస్టమ్స్ డేటాలో వెల్లడైంది. దీనితో చైనా వాణిజ్య మిగులు మేలో 45.53 బిలియన్ డాలర్లకు చేరింది.