తెలంగాణ

telangana

ETV Bharat / business

కొవాగ్జిన్ కాల పరిమితి 12 నెలలకు పొడిగింపు - భారత్ బయోటెక్ టీకా

కొవాగ్జిన్​ టీకా కాలపరిమితిని 12 నెలలకు పెంచింది సీడీఎస్​సీఓ. టీకా తయారైనప్పటి నుంచి 12 నెలల వరకు వినియోగించేందుకు అనుమతిచ్చింది. అదనపు డేటాను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.

Covaxin
కొవాగ్జిన్

By

Published : Nov 3, 2021, 3:56 PM IST

Updated : Nov 3, 2021, 4:48 PM IST

భారత్​ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్​ టీకా కాల పరిమితిని 12 నెలలకు పెంచింది సీడీఎస్​సీఓ(సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్​). టీకా స్థిరత్వానికి సంబంధించి అదనపు సమాచారాన్ని పరిశీలించిన అనంతరం ఈమేరకు ఆమోదం తెలిపింది. దీంతో టీకాను తయారు చేసిన తేదీ నుంచి 12 నెలల వరకు ఉపయోగించుకునే వీలుంటుంది.

భారత్ బయోటెక్ ఈ విషయాన్ని అధికారిక ప్రకటనలో తెలిపింది. సంబంధిత వర్గాలకు దీనిపై సమాచారం ఇచ్చినట్లు పేర్కొంది.

కొవాగ్జిన్​ టీకాను భారత్ సహా అనేక దేశాలు వినియోగిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ అనుమతి కోసం సంస్థ ఇప్పటికే ధరఖాస్తు చేసింది. ఈ విషయంపై డబ్ల్యూహెచ్​ఓ సాంకేతిక సలహా బృందం అతి త్వరలో నిర్ణయం తీసుకోనుంది.

కొవాగ్జిన్​​ టీకాతో కరోనా నుంచి 77.8శాతం, డెల్టా వేరియంట్​ నుంచి 65.2శాతం రక్షణ లభిస్తుందని ఇప్పటికే పరీక్షల్లో తేలింది. భారత్​లో కొవాగ్జిన్ టీకాతో పాటు, ఆస్ట్రాజెనెకా, సీరం సంస్థ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్​ టీకాను వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు 107 కోట్లకుపైగా టీకా డోసులను దేశవ్యాప్తంగా పంపిణీ చేశారు.

ఇదీ చదవండి:మోదీ 'టార్గెట్​ 2070'.. భారత్​కు సాధ్యమేనా?

Last Updated : Nov 3, 2021, 4:48 PM IST

ABOUT THE AUTHOR

...view details