చెరకు సాగుదారులకు ఊరట కలిగిస్తూ కనీస మద్దతు ధర(ఎఫ్ఆర్పీ)పై రూ.10 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం క్వింటాల్ చెరకుకు రూ. 275 కనీస మద్దతు ధర చెల్లిస్తుండగా.. పెంచిన ధరతో ఆ మొత్తం రూ. 285కు చేరింది.
ఈ ఏడాది అక్టోబర్లో ప్రారంభంకానున్న చెరకు కొనుగోలు సీజన్ నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. 2020-21 మార్కెటింగ్ ఏడాదికి చెరకు కనీస మద్దతు ధరను పెంచడంపై ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.