తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం ధర... వెండి భారీగా... - gold price now

పసిడి ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.43,502గా ఉంది. వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.48,146గా ఉంది.

gold prices today
స్వల్పంగా బంగారం, భారీగా వెండి ధరలు తగ్గుదల

By

Published : Feb 26, 2020, 4:32 PM IST

Updated : Mar 2, 2020, 3:42 PM IST

బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.62 తగ్గి రూ.43,502గా ఉంది. వెండి ధర కిలోకు రూ.828 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.48,146గా ఉంది.

రూపాయి బలపడడమే బంగారం ధర తగ్గుదలకు కారణమని విశ్లేషించారు హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్​ తపన్ పటేల్. పసిడి ధర ఇంకా తగ్గే అవకాశమున్నా... కరోనా భయాలు వెంటాడిన నేపథ్యంలో క్షీణత పరిమితంగానే ఉందని వివరించారు.

అంతర్జాతీయ మార్కెట్​లో మాత్రం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,648 డాలర్లుగా, ఔన్స్​ వెండి ధర 18.10 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:రియల్​మీ X ఐక్యూ: రెండు 5జీ స్మార్ట్​ఫోన్లలో ఏది బెటర్​?

Last Updated : Mar 2, 2020, 3:42 PM IST

ABOUT THE AUTHOR

...view details