తెలంగాణ

telangana

ETV Bharat / business

రేపు పని చేయనున్న బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి - శనివారం

భారత్​లో ప్రఖ్యాత స్టాక్ ఎక్స్చేంజి 'బీఎస్​ఈ' శనివారం కూడా పని చేయనుంది. ఈ మేరకు పలు సెగ్మెంట్లలో మాక్​ ట్రేడింగ్ నిర్వహించనున్నట్లు బీఎస్​ఈ ప్రకటించింది.

బీఎస్​ఈ

By

Published : May 3, 2019, 4:39 PM IST

Updated : May 3, 2019, 10:03 PM IST

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి రేపు(శనివారం) మాక్​ సెషన్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందులో ఈక్విటీ, కమోడిటీ, కరెన్సీ డెరివేటివ్​ల ట్రేడింగ్​ జరగనుంది.

అన్ని సెగ్మెంట్ల ట్రేడింగ్ కోసం ఉదయం 9:30 నుంచి 10:00 గంటల మధ్య లాగ్ ఇన్​ అవ్వాల్సి ఉంటుందని బీఎస్​ఈ పేర్కొంది.

ఈక్విటీ డెరివేటివ్స్​ మినహా అన్ని సెగ్మెంట్లలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల ట్రేడింగ్​ సాగనుంది. ఈక్విటీ సెగ్మెంట్​లో రేపు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ట్రేడింగ్​ నిర్వహించనుంది బీఎస్​ఈ.

మాక్​ ట్రేడింగ్ సెషన్​లు సాధాణంగా వారి వ్యవస్థ పనితీరును పరిక్షించేందుకు నిర్వహిస్తుంటారు. దోశ రహిత ట్రేడింగ్ చేసుకునేందుకు ఎక్స్చేంజి సభ్యులకు పటిష్ఠమైన వేదికను అందించే ప్రయత్నంలో ఈ ట్రేడింగ్​ నిర్వహిస్తుంటారు.

Last Updated : May 3, 2019, 10:03 PM IST

ABOUT THE AUTHOR

...view details