దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలు రోజురోజుకు కొండెక్కుతుంటే.. ఇటు అంతర్జాతీయ మార్కెట్లోనూ ధరలు (Crude Oil Price) ఆకాశాన్ని అంటుతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర భారీగా (Crude Oil Price) పెరిగింది. లండన్‌లో ఒక బ్యారెల్ ధర 85 డాలర్ల మార్కును తాకింది. మూడేళ్లలో ఇదే అత్యధికం. ప్రపంచ మార్కెట్లో గ్యాస్, బొగ్గు కొరత కారణంగా.. చమురు ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. దీనికి తోడు ఆసియాలో విద్యుత్ ఉత్పత్తి తగ్గడం కూడా ఓ కారణమని ఓ అంతర్జాతీయ ఇంధన సంస్థ పేర్కొంది. మరోవైపు అమెరికాలో కూడా చమురు నిల్వలు దారుణం పడిపోవడం ఈ పరిస్థితికి దారి తీసినట్లు తెలిపింది.
Crude Oil Price: మూడేళ్ల గరిష్ఠానికి క్రూడాయిల్ ధరలు- మరి భారత్‌లో? - అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన చమురు ధరలు
అంతర్జాతీయంగా క్రూాడాయిల్ ధరలు (Crude Oil Price) భారీగా పెరిగాయి. లండన్‌లో ఓ బ్యారెల్ ధర మూడేళ్ల గరిష్ఠానికి చేరింది. కరోనా ఆంక్షలు తొలగిన తరువాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవడంతో చమురుకు డిమాండ్ ఎక్కువైంది. దీంతో ధరలు పెరుగుతున్నాయని ఓ అంతర్జాతీయ ఇంధన సంస్థ తెలిపింది.
కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థలు ఒక్కొక్కొటి తెరుచుకోవడంతో ఆయిల్‌కు డిమాండ్ పెరిగింది. దీనికి తోడు ముడి చమురు సరఫరా కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా ఇంధన మంత్రి ఒపెక్‌తో (OPEC News) (ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్) పాటు మిత్రదేశాలు ఉత్పత్తిని క్రమక్రమంగా పునరుద్ధరించాలని సూచించారు. చైనా కూడా 16 ప్రైవేట్ రిఫైనరీల నుంచి చమురు దిగుమతికి ఓకే చెప్పింది.
ఇదీ చూడండి:Petrol Price: పండగ రోజూ మోతే- మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు