గతేడాదిలో చాలా నెలలకు వేతనాన్ని, పనితీరు ఆధారంగా ఇచ్చే బోనస్‌ను బోయింగ్ సీఈఓ డేవిడ్ కాల్‌హౌన్ వదులుకున్నారు. అయితే షేర్ల ప్రయోజనాల (స్టాక్ ఆప్షన్స్) రూపంలో 21 మిలియన్ డాలర్లను ఆయన అందుకున్నట్లు తెలుస్తోంది. రెండు 737 మ్యాక్స్ విమానాలు ప్రమాదానికి కారణమవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ విమానాల సేవలు నిలిచిపోవడం, కరోనా పరిణామాల కారణంగా విమానాలకు గిరాకీ తగ్గిపోవడం లాంటి వాటి కారణంగా కిందటేడాది బోయింగ్ ఇబ్బందులను ఎదుర్కొంది. దీంతో బోయింగ్ సుమారు 12 బిలియన్ డాలర్ల మేర నష్టాన్ని చవిచూసింది.
నాకు జీతం, బోనస్ వద్దు: బోయింగ్ సీఈఓ - జీతం వద్దన్న బోయింగ్ సీఈఓ
బోయింగ్ విమాన సంస్థ సీఈఓ డేవిడ్ కాల్హౌస్.. ఆయనకు సంస్థ ఇచ్చే జీతం, బోనస్ వద్దని అన్నారు. గతేడాదిలోనూ ఈయన సంస్థ తరఫున జీతాన్ని వదులుకున్నారు. కానీ, షేర్ల ప్రయోజనాల (స్టాక్ ఆప్షన్స్) రూపంలో 21 మిలియన్ డాలర్లను ఆయన అందుకున్నట్లు సమాచారం.
కాల్‌హౌన్ 2020 జనవరిలో సీఈఓ అయ్యాక.. మార్చిలో వేతన నిరాకరణ నిర్ణయానికి ముందు కాలానికి 2,69,231 డాలర్ల వేతనాన్ని అందుకున్నారు. అయితే మ్యాక్స్ విమానాల సర్వీసులను పునఃప్రారంభమయ్యేలా చేసినందుకు 7 మిలియన్ డాలర్లు, బ్లాక్‌స్టోన్స్‌లో తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చినందుకు 10 మిలియన్ డాలర్లు, దీర్ఘకాలిక ప్రోత్సాహకాల కింద 3.5 మిలియన్ డాలర్ల మేర షేర్ల ప్రయోజనాలు కాల్‌హౌన్‌కు లభించాయి. వచ్చే మూడేళ్ల కాలంలో ఈ షేర్ల ప్రయోజనాలు ఆయన చేతికి వస్తాయి.
ఇదీ చదవండి:'వ్యూహాత్మక తయారీతోనే సత్వర ఆర్థికాభివృద్ధి'