తెలంగాణ

telangana

ETV Bharat / business

జీవితకాల గరిష్ఠానికి బిట్​కాయిన్​

బిట్​కాయిన్ విలువ రోజురోజుకూ పెరుగుతూ ఆకాశాన్ని తాకుతోంది. ఈ రోజుతో దీని విలువ జీవితకాల గరిష్ఠానికి చేరుకుంది. పదేళ్ల కాలానికి బెస్ట్ పెర్ఫార్మింగ్ అసెట్​గా నిలిచింది.

Bitcoin hits all-time high above USD 29,000
జీవితకాల గరిష్ఠానికి బిట్​కాయిన్​

By

Published : Dec 31, 2020, 1:32 PM IST

బిట్​కాయిన్ ధరలకు రెక్కలొచ్చాయ్​. ఆ క్రిప్టో కరెన్సీ విలువ జీవితకాల గరిష్ఠానికి చేరింది. రష్యా మార్కెట్​లో 29వేల డాలర్ల మార్క్​కు చేరుకుంది.

ట్రేడింగ్ వాల్యూమ్​లో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ అయిన బినాన్స్ చివరి సెషన్​లో ఒక్కో బిట్ కాయిన్ 29,000 డాలర్లకు పైగా ట్రేడైంది. చివరకు 28,2840 డాలర్ల వద్ద ముగిసింది.

ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రిప్టో కరెన్సీ మార్కెట్లో బిట్‌కాయిన్ వాటా 70.5 శాతం. బిట్​కాయిన్ అనేది తొలి క్రిప్టోకరెన్సీ పేరు. 2009లో దీన్ని రూపొందించారు. 2020లో దీని విలువ అమాంతం పెరగడం విశేషం.

ఇదీ చూడండి: బిట్​కాయిన్​ తరహాలో ఫేస్​బుక్​ కొత్త కరెన్సీ!

ABOUT THE AUTHOR

...view details