తెలంగాణ

telangana

ETV Bharat / business

సెప్టెంబర్​ నాటికి కొవాగ్జిన్​కు డబ్ల్యూహెచ్​ఓ అనుమతి! - covaxin world health organisation

ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్‌ మధ్య కొవాగ్జిన్​ టీకా వినియోగానికి డబ్ల్యూహెచ్​ఓ అనుమతి వచ్చే అవకాశం ఉందని భారత్‌ బయోటెక్ తెలిపింది. కొవాగ్జిన్‌కు 60 దేశాల్లో అనుమతుల ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించింది. 13 దేశాలు అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చాయని, త్వరలో మరిన్ని ఇస్తాయని తెలిపింది.

Bharat Biotech expects WHO nod for Covaxin in July-September
జులై-సెప్టెంబర్​ మధ్య కొవాగ్జిన్​కు డబ్ల్యూహెచ్​ఓ అనుమతి!

By

Published : May 25, 2021, 7:52 PM IST

జులై-సెప్టెంబర్​లో.. తమ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్​ టీకా అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి లభిస్తుందని భారత్​ బయోటెక్ ఆశాభావం వ్యక్తం చేసింది. అమెరికా, బ్రెజిల్ సహా 60 దేశాల్లో కొవాగ్జిన్​ టీకా అనుమతికి సన్నాహాలు జరుగుతున్నట్లు పేర్కొంది.

'కొవాగ్జిన్ అత్యవసర వినియోగ అనుమతికి డబ్ల్యూహెచ్​ఓకు దరఖాస్తు చేశాం. జులై-సెప్టెంబర్ 2021లో అనుమతి లభించే అవకాశముంది.' అని భారత్ బయోటెక్ పేర్కొంది. ఇప్పటికే 13 దేశాల్లో భారత్​ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన టీకాకు అనుమతి లభించింది.

ABOUT THE AUTHOR

...view details