రూ.8 వేల లోపు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. బడ్జెట్లో.. రూ.8,000 లోపు మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్ఫోన్ల సమాచారం తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..
రియల్మీ 3ఐ
8వేల లోపు ధర ఉన్న అత్యుత్తమ ఫోన్‌గా నిలిచింది రియల్మీ 3ఐ. 6.2 అంగుళాల డ్యూడ్రాప్ ఫుల్స్క్రీన్తో ఈ మోడల్‌ను తీసుకువచ్చింది రియల్మీ. ఇందులో 4230 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని పొందుపరిచారు. హీలియో పీ60 చిప్సెట్తో ఈ ఫోన్ పని చేస్తుంది. రెండు వెనుక కెమెరాలు(13 ఎంపీ, 2 ఎంపీ) ఉన్న రియల్మీ 3ఐ మోడల్.. 3 జీబీ ర్యామ్-32 జీబీ రామ్, 4 జీబీ ర్యామ్-64 జీబీ రామ్ వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే ఇందులో 3 జీబీ ర్యామ్ ఫోన్ ధర మాత్రమే రూ.8000 లోపు ఉంది.
ఇన్ఫినిక్స్ ఎస్4
మూడు వెనుక కెమెరాలు (13 ఎంపీ, 8 ఎంపీ, 2 ఎంపీ )తో రూ.10 వేల లోపు అందుబాటులో ఉన్న అతి తక్కువ ఫోన్లలో ఇన్ఫినిక్స్ ఎస్4 ఒకటి. ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతో పాటు ఈ ఫోన్ కెమెరా క్వాలిటీ హైలెట్‌గా నిలుస్తోంది. ఇన్ఫినిక్స్ ఎస్4 మోడల్ ఫోన్ చూడటానికి అందంగా ఉంటుంది. ప్రత్యేకించి నీలిరంగులోని ఫోన్ వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇన్ఫినిక్స్ ఎస్4 మోడల్లో మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌ను పొందుపరిచారు. 6.21 అంగులాల పూర్తి హెచ్‌డీతో..3 జీబీ ర్యామ్-32 జీబీ రామ్, 4 జీబీ ర్యామ్-64 జీబీ రామ్ వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్లో పొందుపరిచారు. అయితే ఇందులో 3 జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ మాత్రమే రూ.8 వేల లోపు అందుబాటులో ఉంది.